బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో నోటీసులు ఇవ్వగా నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించారు.
నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణలో కీలక నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది.
Also Read:ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?: హరీశ్ రావు