విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
విడుదలై మూడు వారాలు పూర్తి కావొస్తున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.303 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిచారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలు నటించారు.
Also Read:పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు