TTD:రథసప్తమి .. వీఐపీ దర్శనాలు రద్దు

0
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవోపేతంగా జరిగే రథసప్తమి వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేసింది.

వేకువజామున 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామి వారు భక్తుల మధ్యనే ఉండి దర్శన భాగ్యం ఇస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి.

సోమవారం నుంచి ఈ నెల 5వ తేదీవరకు మూడు రోజుల పాటు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. అలాగే రథసప్తమి రోజు తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను కూడా రద్దు చేసిన టీటీడీ ఏకాంతంగా సేవలను నిర్వహించనుంది.

Also Read:అభిషేక్ సునామీ..టీమిండియా ఘన విజయం

- Advertisement -