దక్షిణాది అంటే బీజేపీకి చిన్నచూపే:హరీశ్‌

1
- Advertisement -

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కేంద్రంతో బడే భాయ్ చోటే భాయ్ బంధం అన్నారు. ఇప్పుడు ఏమైంది ? చోటే భాయ్ ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు, ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు.

దేశ జీడీపీకి 5.1 శాతం ఇస్తున్న తెలంగాణకు, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించడం లేదు. స్వంత ఆదాయ వనరుల పునరుద్ధరణలో దేశంలో అగ్రగ్రామిగా ఉన్న తెలంగాణకు చేయూత ఇవ్వకుండా తక్కువ నిధులు ఇస్తూ చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదు పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపైన రావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలి.. దేశంలో భవిష్యత్తులో సంకీర్ణ ప్రభుత్వమే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేస్తే మనకు రావాల్సిన హక్కులను కాపాడుకోవచ్చు, నిధులను సాధించుకోవచ్చు అన్నారు.దక్షిణ భారతదేశమంటేనే మొదటి నుండి బీజేపీకి చిన్నచూపు…గతంలో కూడా దేశంలో 142 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదు. మెడికల్ పీజీ విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు.

దక్షిణాదిలో రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు పెట్టుకొని కాలేజీలు, ఆస్పత్రులు నడుపుతుంటే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సీట్లలో 50% స్థానిక కోటా ఉండదు అంటే తీవ్ర అన్యాయం చేయడమే కదా.. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అయినా బడ్జెట్ లో రాష్ట్రానికి సాధించింది ఏం లేదు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి అన్నారు.

Also Read:డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్..కంప్లీట్ డ్యాన్స్ షో

- Advertisement -