తండేల్..ప్రీ రిలీజ్ వాయిదా

1
- Advertisement -

పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోడంతో అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రానున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం జరగాల్సిన తండేల్ ఈవెంట్‌కు ఇవ్వాళ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆదివారం సాయంత్రానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం.

ఈరోజు సాయంత్రం బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వారి ఫార్మ్ హౌస్లో ఇండస్ట్రీ పెద్దలకు, కుటుంబీకులకు పార్టీ ఇవ్వనున్నారు.

ఈ పార్టీ సినిమా ఈవెంట్ కాకపోయినా, అభిమానులు రాకపోయినా, ఒకే రోజు రెండు సినీ ఈవెంట్లకు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడంతో తండేల్ ఈవెంట్ వాయిదా వేశారని సమాచారం.

Also Read:‘తండేల్’..పెద్ద విజయం సాధించాలి

- Advertisement -