రథ సప్తమి రోజు ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు. రథ సప్తమి ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రథ సప్తమికి దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. రథ సప్తమి రోజు ఏడు వాహనాల్లో మలయప్ప స్వామి ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
మరోవైపు డోనర్స్ ప్రివిలేజ్ పేరుతో నకిలీ టికెట్ల దందాకు కొంతమంది తెరలేపారు. డోనర్స్ రిఫరెన్స్ టికెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లారు హైదరాబాద్ వాసి ఉపేందర్.వైకుంఠం-1లో స్కాన్ కానీ ఉపేందర్ టికెట్లు.. డోనర్ సెల్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించింది సిబ్బంది.
డోనర్ సెల్ లో ఉపేందర్ కు ఇచ్చినవి నకిలీ టికెట్లుగా గుర్తించారు. 3 టికెట్ల కోసం రూ.2100 వసూలు చేసిన నళినీకాంత్, సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు. విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
Also Read:నాగ సాధువులు.. పిండ ప్రధానం!

