అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు మరోసారి బలమైన హెచ్చరిక జారీ చేశారు. అమెరికా డాలర్‌ను గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా నిలిపేందుకు భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అన్నారు.
ట్రంప్ గురువారం ట్రూత్ సోషల్ ద్వారా చేసిన ప్రకటనలో బ్రిక్స్ దేశాలు డాలర్‌ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తే, వాటిపై 100% టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తాను అని స్పష్టం చేశారు. ఇది 2024 నవంబర్‌లో ఇచ్చిన హెచ్చరికకు మళ్లీ పునరుద్ఘాటనగా మారింది.
బ్రిక్స్‌పై ట్రంప్ ఏదైనా ఆంక్షలు విధిస్తే, భారత్‌కు తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు బలంగా ఉండటంతో, అధిక సుంకాల కారణంగా భారత్‌కు భారీ ఆర్థిక నష్టం సంభవించవచ్చు.2023-24లో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $118.3 బిలియన్లుగా ఉంది.
అమెరికాకు భారత్ $41.6 బిలియన్ విలువైన ఎగుమతులు చేసింది.ట్రంప్ హెచ్చరికలు బ్రిక్స్ దేశాలను ఎలాంటి నిర్ణయానికి నడిపిస్తాయో చూడాల్సి ఉంది.
Also Read:పార్టీ ఫిరాయింపులు..బీఆర్ఎస్ పిటిషన్ వాయిదా