- Advertisement -
తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. తన కలం, గళంతో గద్దర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక అని స్మరించుకున్నారు.
గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి పేరుతో అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
Also Read:ఎలాన్ మస్క్ సాయం కోరిన ట్రంప్
- Advertisement -