ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో విధివిధానాలు రూపొందించి తొందరగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు అధికారులు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు.
యాదగిరిగుట్ట పాలక మండలి నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు.
Also Read:వీఐపీలకు ప్రాధాన్యం వల్లే తొక్కిసలాట: ఖర్గే