మేఘా కంపెనీ ని ఈస్ట్ ఇండియా కంపెనీ తో పోల్చిన రేవంత్ రెడ్డి అదే సంస్థతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆనంద్…అనంతగిరి అడవులను మేఘా సంస్థకు రేవంత్ వెయ్యికోట్లకు దారాదత్తం చేశారు అన్నారు.
మెఘా అనేది ఇంజినీరింగ్ సంస్థ .వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు కు మేఘాతో ఎలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు ?..అనంతగిరి అడవులను అప్పగించే ప్రయత్నం పై త్వరలోనే ప్రజా మద్దతుతో ఉద్యమం ప్రారంభిస్తాం అన్నారు. వికారాబాద్ రోడ్లను బాగు చేయని సీఎం లక్ష కోట్లు పెట్టుబడులు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు ..సీఎం రేవంత్ కు టీబీ ఏమిటో లెప్రసి ఏమిటో కూడా తెలియడం లేదు అన్నారు.
ముందు రోడ్లు బాగు చేయండి …ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లో మోసాలు జరుగుతున్నాయి …బేస్మెంట్ వరకు కట్టుకుంటే డబ్బులు ఇస్తామంటున్నారు ..ఎస్సీ ,ఎస్టీల దగ్గర డబ్బులు ఎక్కడివి ?…అన్ని పథకాల్లో మోసమే జరుగుతోంది …తూతూ మంత్రంగా మండలానికో గ్రామం లో పథకాలు ప్రారంభించారు.
మునిపల్ వార్డుల్లో ఎక్కడా పథకాలు ప్రారంభం కాలేదు ..ఉపాధి హామీ కార్డుతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు లింక్ పెట్టడం ఏమిటీ ?…జాబ్ కార్డుతో సంబంధం లేకుండా భూమి లేని కూలీలు అందరికీ పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలి …రేవంత్ ప్రజలకు ఇచ్చేది తక్కువ ఎగ్గొట్టేది ఎక్కువ అని పథకాలను చూస్తే అర్థమవుతుంది …పథకాలకు అర్హులు కావాలంటే ప్రజలు భూములు అమ్ముకునే పరిస్థితిని రేవంత్ రెడ్డి తెచ్చారు …బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి ..రిజర్వేషన్లు పెంచక ఎన్నికలు నిర్వహిస్తే బీసీ లు కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు రానివ్వొద్దు అన్నారు.
Also Read:దావోస్ పెట్టుబడులపై రేవంత్‌వి గొప్పలే: బీఆర్ఎస్