దావోస్ పెట్టుబడులపై రేవంత్‌వి గొప్పలే: బీఆర్ఎస్

2
- Advertisement -

కుంభ మేళా లో జరిగిన తొక్కిసలాట లో భక్తులు మరణించడం దిగ్భ్రాంతి ని కలిగించిందన్నారు మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మధుసూదనాచారి….మృతుల కుటుంబాలకు బీ ఆర్ ఎస్ పార్టీ తరపున సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నారు. మృతుల కుటుంబాలను కేంద్రం ,యూపీ ప్రభుత్వం ఆదుకోవాలి ..క్షత గాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల పై గొప్పలు చెప్పుకుంటున్నారు ..దావోస్ టూర్ నెట్ వర్కింగ్ కు మాత్రమే ఉపయోగ పడుతుందని చంద్రబాబు సరిగ్గా చెప్పారు ..దేశం లో తన పాటి సీఎం మఱొక్క లేనట్టుగా రేవంత్ మాట్లాడటం హాస్యస్పదం అన్నారు. గతం లో కుదిరిన 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 10 వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్రానికి రాలేదు ..దావోస్ లో కుదిరే పెట్టుబడుల్లో చాలా వరకు రావని గత అనుభవాలు చెబుతున్నాయి అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు…పథకాల పై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక రేవంత్ పెట్టుబడుల పై మాట్లాడుతున్నారు అన్నారు. సుస్థిర పాలన కేసీఆర్ ఆనాడు అందించారు కనుకే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి వాస్తవరూపం దాల్చాయి..కే టీ ఆర్ పనితనం వల్లే ఐటీ రంగం రాష్ట్రం లో పురోగమించిందన్నారు. అసహనం వల్లే సీఎం కే టీ ఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ..రేవంత్ రెడ్డి అట్టెన్షన్ డెఫిషియన్సీ సిన్డ్రోమ్ తో భాదపడుతున్నారు అన్నారు.

Also Read:కుంభమేళా ఘటనపై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి

సింగుపూర్ ను రాష్ట్రం అంటున్నాడు ..అమెజాన్ వెబ్ సీరీస్ అంటున్నాడు …టీబీ వ్యాధిని లెప్రసి గా చెబుతున్నాడు ..ఇలాంటి అవగాహన లేని సీఎం దేశం లో మరొకరు లేరు అన్నారు. అనుభవరాహిత్యం లో రేవంత్ కు రేవంతే సాటి ..ప్రజలను రేవంత్ ఊహల పల్లకిలో ఊరేగిస్తున్నాడు అన్నారు. రేవంత్ అన్నింటిపై పలాయన వాద వైఖరి అవలంభిస్తున్నాడు ..రేవంత్ వి ఉత్తరకుమార ప్రగాల్భాలు అన్నారు. కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తే రేవంత్ రాష్ట్రం లో అస్థిరత తెచ్చారు
..ప్రజలే స్వచ్చంధంగా ప్రభుత్వం పై తిరగబడుతున్నారు అన్నారు. కేసీఆర్ కట్టిన అంత పెద్ద సచివాలయం ఉండగా పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి సీఎం రేవంత్ ఎందుకు సమీక్షలు చేస్తున్నారు …పోలీస్ పాలన ,మాఫియా పాలన తెచ్చేందుకే రేవంత్ తరచూ కమాండ్ కంట్రోల్ కి వెళ్తున్నారు…రేవంత్ తస్మాత్ జాగ్రత్త ,బీ ఆర్ ఎస్ నేతల పై తప్పుడు కేసులు సహించం …ఇప్పటికైనా సీఎం హామీల అమలు పై దృష్టి సారించాలన్నారు.

- Advertisement -