కుంభమేళాకు ప్రకాశ్‌ రాజ్..ఫేక్ ఫోటో అంటూ క్లారిటీ!

16
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా కన్నుల పండువగా సాగుతోంది. ఇక ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది.

ఇక పలువురు ప్రముఖులు సైతం కుంభమేళాలో పుణ్య స్నానం చేయగా మరికొంతమంది ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక తాజాగా కుంభమేళాలో నటుడు ప్రకాష్ రాజ్ పుణ్యస్నానం ఆచరించారని ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాస్తికుడు అని చెప్పుకునే మీరు కుంభమేళాకు ఎలా వెళ్లారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించారు ప్రకాష్ రాజ్.. అది ఫేక్ ఫోటో అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా చేయడం సిగ్గు చేటు అని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

 

Also Read:కాంగ్రెస్ 420 హామీలపై వినూత్న నిరసన

- Advertisement -