సిఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టబడులు వెనక్కి పోయాయని ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమాన్. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం మట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…తాను రాజకీయాల్లో రాకముందు ఐపీఎస్ అధికారిగా, క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా, అడిషనల్ డీజీపీగా, వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశానని తెలిపారు.
రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల లేని అవినీతిని పేపర్ మీద పెట్టి అనవసరంగా తెలంగాణకు నష్టం జరుపుతున్నాడన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసలు మద్దాయి రేవంత్ రెడ్డి అన్నారు. కేటిఅర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి లు భాధ్యులు కారని తెలిపారు.
Also Read:ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ కేసు