హైడ్రా ప్రజావాణి..బాధితుల క్యూ

3
- Advertisement -

రెండు వారాల్లో అధికారులు మీ సమస్యలపై విచారణ చేపట్టకపోతే నాలుగో వారం నేనే వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేపడతానని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు రక్షించిన ప్రతీ భూమిలో ఈ స్థలం హైడ్రా ద్వారా పరిరక్షించబడినట్లు బోర్డులు పాతాలని సూచించారు.

బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. తమ ఇళ్ల స్థలాలను ప్లాట్లుగా మార్చి, ఇతరులకు విక్రయిస్తున్నారంటూ ఐలాపూర్‌ రామ గోపాల్‌నగర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే సుమారు 700 ఇళ్లను నిర్మించారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగనాథ్‌ 78 మంది ఫిర్యాదులను స్వీకరించారు.అమీన్‌పూర్‌ పద్మావతి లేఅవుట్‌లో ఏపీ వైకాపా నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆక్రమంగా నిర్మించిన ప్రహరీని ఇటీవల హైడ్రా కూల్చింది. తాజాగా అక్కడ కంచె నిర్మాణమైందంటూ బాధితులు హైడ్రాను ఆశ్రయించారు.

Also Read:ఇన్ఫోసిస్‌ గోపాలకృష్ణన్‌ పై ఎస్సీ, ఎస్టీ కేసు

- Advertisement -