2025 పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ వేళ కళలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమ, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు తదితర వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. పద్మ విభూషణ్ పురస్కారానికి ఏడుగురు, పద్మభూషణ్‌కు 19 మంది ఎంపికయ్యారు.
పద్మ విభూషణ్ అవార్డులు:
దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి(వైద్యం), తెలంగాణ; జస్టిస్(రిటైర్డ్) జగదీశ్ సింగ్ ఖేహర్(రాజకీయ), చండీగఢ్; కుముదినీ రజనీకాంత్ లఖియా(కళలు), గుజరాత్; లక్ష్మీనారాయణ సుబ్రమణియం(కళలు), కర్ణాటక; ఎంటీ వాసుదేవన్ నాయర్(మరణానంతరం)(సాహిత్యం-విద్య), కేరళ; ఒసాము సుజుకీ(మరణానంతరం)(వాణిజ్యం, పరిశ్రమలు), జపాన్; శారదా సిన్హా(మరణానంతరం)(కళలు), బీహార్.
పద్మభూషణ్:
ఏ.సూర్యప్రకాశ్(సాహిత్యం, విద్య-జర్నలిజం), కర్ణాటక; అనంతనాగ్(కళలు), కర్ణాటక, బిబేక్ దేబ్రాయ్(మరణానంతరం)(సాహిత్యం, విద్య), ఎన్‌సీటీ ఢిల్లీ; జతిన్ గోస్వామి(కళలు), అస్సాం; జోస్ చాకో పెరియప్పురం(వైద్యం), కేరళ; కైలాష్ నాథ్ దీక్షిత్(పురావస్తు), ఎన్‌సీటీ ఢిల్లీ, మనోహర్ జోషి(మరణానంతరం)(ప్రజావ్యవహారాల),మహారాష్ట్ర; నల్లి కుప్పుస్వామి చెట్టి(వాణిజ్యం, పరిశ్రమలు) తమిళనాడు; నందమూరి బాలకృష్ణ(కళలు), ఏపీ; శ్రీజేష్(క్రీడలు), కేరళ; పంకజ్ పటేల్(వాణిజ్యం), గుజరాత్; పంకజ్ ఉదాస్(కళలు), (మరణానంతరం), మహారాష్ట్ర; రాంబహదూర్ రాయ్(సాహిత్యం, విద్య-జర్నలిజం), ఉత్తర్ ప్రదేశ్; సాధ్వి రితంభర(సామాజిక సేవ), ఉత్తర్ ప్రదేశ్; అజిత్ కుమార్(కళలు), తమిళనాడు, శేఖర్‌కపూర్(కళలు), మహారాష్ట్ర; శోభన (కళలు), తమిళనాడు; సుశీల్ కుమార్ మోదీ(మరణానంతరం), (రాజకీయ), బీహార్; వినోద్ ధామ్((సైన్స్, టెక్నాలజీ), అమెరికా.
నాలుగు దశాబ్దాలుగా దళిత ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్న మంద కృష్ణమాదిగ వరంగల్ జిల్లాలోని శాయంపేటలో జన్మించారు. 1980లలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెన్నైలో జన్మించారు. బాల నటుడిగా నట ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన్ని పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం.
Also Read:హ్యాపీ బర్త్ డే…రవితేజ