దావోస్ టూర్..బోగస్ టూర్: క్రిశాంక్

0
- Advertisement -

దావోస్ టూర్ ను సీఎం రేవంత్ రెడ్డి బోగస్ గా మార్చారు అన్నారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్…..గతం లో మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అబద్దాలతో గడిచిందన్నారు. దావోస్ పెట్టుబడుల పై రేవంత్ రెడ్డి ప్రతిపక్షం లో ఉన్నపుడు ఓ మాట అధికారం లో ఉన్నపుడు ఓ మాట మాట్లాడుతున్నారు ..పెట్టుబడుల ద్వారా కంపెనీలకే లాభం తప్ప ప్రజలకు ఒరిగేదేమి లేదు అని రేవంత్ రెడ్డి గతం లో ఉన్నారు…పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కూడా దావోస్ పెట్టుబడులతో ఉపయోగం లేదన్నారు.

దావోస్ లో గత సంవత్సరం లో వచ్చిన పెట్టుబడులు 40 వేల కోట్ల రూపాయలు అని ప్రభుత్వం ప్రకటించింది…అందులో ఇప్పటివరకు వచ్చినవి ఏమీలేవు ..అదానీ ,jsw ,ఉబర్ ,గోడి ఇండియా లాంటి సంస్థలు పెట్టుబడులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవీ వాస్తవ రూపం దాల్చలేవు అన్నారు. భట్టి విక్రమార్క కూడా దావోస్ పెట్టుబడులు కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ మాత్రమే అన్నారు.

మేఘా కంపెనీ ని రేవంత్ ఈస్ట్ ఇండియా కంపెనీ తో పోల్చారు,….ఈస్ట్ ఇండియా కంపెనీ యూరోప్ లో ఉంది , దావోస్ కూడా యూరోప్ లో ఉంది..మేఘా కంపెనీ యూరోప్ కు చెందినదనే దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్నారా ? చెప్పాలన్నారు. సన్ సంస్థ ఎండీ దావోస్ లో లేకున్నా ఉన్నారని ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంఓ తప్పుడు ప్రకటన ఇచ్చింది …రాష్ట్రానికి సీఎం గా ఉన్న వ్యక్తి తప్పుడు సమాచారం ఇవ్వొచ్చా ?,…సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సంఘ్వీ స్థానం లో వేరే వ్యక్తి తో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో దిగారు …అమెజాన్ సంస్థ పెట్టుబడులు కూడా కేసీఆర్ హాయం లో వచ్చినవే ..ఇపుడు వచ్చాయని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు ..పాకిస్థాన్ కు చెందిన సంస్థ మెయిన్ హార్ట్ ఎండీ తో రేవంత్ మరోసారి సమావేశమయ్యారు ..మూసి అభివృద్ధి పేరిట పాకిస్థాన్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది ..డెస్టినేషన్ వెడ్డింగ్ లు చూశాము .ఇపుడు రేవంత్ రెడ్డి దావోస్ లో మన రాష్ట్రం కంపెనీ లతో దావోస్ లో ఒప్పందాలు కుదుర్చుకుని డెస్టినేషన్ ఇన్వెస్ట్మెంట్స్ గా మార్చారు అన్నారు.

రాహుల్ గాంధీ రాజకీయాలు రాకముందు టెకీ యే అన్న వాస్తవాన్ని రేవంత్ మరచినట్టున్నారు ..పంప్డ్ స్టోరేజి పై అనేక పెట్టుబడులు కుదిరియాంటున్నారు ..అసలు ఎనర్జీ పాలసి యే రూపొందించలేదని బట్టి అంటున్నారు ..పాలసి లేనిది ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటున్నారు ?..డాటా సెంటర్లు వస్తున్నాయంటే కేసీఆర్ హాయం లో మెరుగు పడ్డ విద్యుత్ వ్యవస్థే కారణం .కేసీఆర్ పేరు తీసుకోవడానికి రేవంత్ నామోషే ..ఎవరెవరి పేర్లో చెబుతున్నారు అన్నారు.

Also Read:ఆస్ట్రేలియా ఓపెన్.. వైదొలిగిన జకోవిచ్

- Advertisement -