నిర్మాత దిల్ రాజు ఇళ్లు, ఆఫీస్‌లపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటి వాళ్ళు తీసుకెళ్లారు అన్నారు దిల్ రాజు భార్య తేజస్విని. ఉదయం నుంచి ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.. సినిమా రిలేటెడ్ లో భాగంగానే సోదాలు చేస్తున్నారు అన్నారు.
ఐటీ సోదాలు జనరల్ గా జరిగే సోదాలు మాత్రమే.. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారు అన్నారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామన్నారు.
దిల్ రాజు ఆఫీస్‌లతో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇంట్లో, ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. పుష్ప-2 సినిమా నిర్మించినమైత్రి మూవీ మేకర్స్ భారీ కలెక్షన్లు సాధించింది పుష్ప-2 సినిమా.
Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్