లక్ష్మీ మిట్టల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు

2
- Advertisement -

దావోస్ పర్యటన సందర్భంగా లక్ష్మీమిట్టల్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.

లక్ష్మీమిట్టల్ తో చంద్రబాబు, లోకేశ్, ఇతర బృందం సభ్యులు ఉన్న ఫొటోను షేర్ చేశారు నారా లోకేశ్. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్, భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరాను. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపాను. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీ మిట్టల్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాను. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై లక్ష్మీమిట్టల్ సానుకూలంగా స్పందించారు అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ పలు కంపెనీల ప్రతినిధులో భేటీ అవుతుంది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పారిశ్రామిక వేత్తలతో వరుసగా చంద్రబాబు, లోకేశ్ భేటీ అవుతున్నారు.

Also Read:ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన తప్పనిసరి: పొన్నం

- Advertisement -