దిల్ రాజు, మైత్రీ మేకర్స్‌ పై ఐటీ సోదాలు

5
- Advertisement -

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి.

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో దిల్‌ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు..

అలాగే మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 సినిమా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్.భారీ కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read:రీవెంజ్ పాలిటిక్స్ మంచిది కాదు: జగ్గారెడ్డి

- Advertisement -