తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది రష్మి. ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.
అప్పుడప్పుడూ సినిమాల్లోనూ తన మార్క్ ని చూపించే ప్రయత్నం చేస్తూ..అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగులో చిత్రాల్లోనూ అడపాదడపా నటిస్తూనే ఉంది.
తమిళంలో కండేన్, మాప్పిళై వినాయగర్ చిత్రాల్లో నాయకిగా నటించిన రష్మీ.. తాజాగా ప్రియముడన్ ప్రియా అనే చిత్రంలో నటిస్తోంది. ఒక బుల్లి తెర నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. అయితే రేష్మీ అదంతా బేస్‌లెస్ ప్రచారం అని కొట్టిపారేస్తోంది.
దీని గురించి ఈ అమ్మడు చెబుతూ తానెవరినీ ప్రేమించడం లేదని చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం తన పనిలో తాను చాలా సంతోషంగా ఉన్నానని, తానెవరినీ ప్రేమించడం లేదని, తన ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉందని చెప్పుకొచ్చింది.
సినిమాల్లో నటిస్తూ బుల్లితెర కార్యక్రమాలు చేస్తున్నారేమిటని అడుగుతున్నారని, టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా చేయడం తప్పా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఇంకా చెప్పాలంటే తానీ స్థాయికి రావడానికి బుల్లితెరే కారణం అని పేర్కొంది.
అంతేకాకుండా టీవీ రంగంలోకి రాక ముందు తాను సినిమాల్లో ట్రై చేశానని, దాదాపు 14 సంవత్సరాల పాటు నిలదొక్కుకునేందుకు పోరాడానని చెప్పుకొచ్చింది. ఫైనల్‌గా మాత్రం తనకి బుల్లితెర రంగమే బాగా గుర్తింపు తెచ్చిందని, ఆ తర్వాతే సినిమాల్లో అవకాశాలు పెరిగాయంది రష్మి.
అయితే బుల్లితెర రంగాన్ని ఎవరూ తక్కువ చేసి చూడొద్దని, వెండితెరకు ధీటుగా బుల్లితెరకు ఆదరణ ఉందని… పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు బుల్లితెర వైపు చూస్తున్నారని యాంకర్ రష్మి స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. రష్మి ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది. సినిమాలు చేస్తూనే జబర్దస్త్ కామెడీషోకు యాంకర్ గా, ఆడియో ఫంక్షన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది రష్మి.