ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ ( EPFO)గుడ్ న్యూస్ అందించింది. కొత్త ఫీచర్ ఆటోమేటిక్ ఈపీఎఫ్ బదిలీని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో పీఎఫ్ ఖాతాదారుల పేరు, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలను మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ ఫీచర్ సాయంతో ఎలాంటి ఫారమ్‌లను నింపాల్సిన అవసరం లేకుండా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంప్లాయర్ల మధ్య సజావుగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలుంటుంది.
అలాగే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఉద్యోగాల అంతటా మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) నిర్వహించడం ద్వారా ఒకే అకౌంటులో మెర్జ్ అవుతుంది. మీ పదవీ విరమణ సేవింగ్స్ కూడా సులభంగా ట్రాక్ చేస్తుంది. మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ స్టేటస్ గురించి మీకు తెలిసేలా ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ అప్‌డేట్‌లతో ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది.
()ముందుగా మీ UAN వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్‌ని ఉపయోగించాలి.
()మీ ఐడెంటిటీ అన్ని యజమానులచే ధృవీకరించి ఉండాలి. అప్పుడే నిధుల బదిలీ సులభంగా జరుగుతుంది.
()అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లు, మీ ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ మీ UAN కనెక్ట్ అయి ఉండాలి.
మీ UAN కచ్చితంగా మ్యాప్ అయి మునుపటి ఈపీఎఫ్ అకౌంటుకు అవసరమైన కేవైసీ సమాచారంతో అప్‌డేట్ చేయాలి.
()ఈ అవసరాలు ఏవైనా తీరకపోతే బదిలీ అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు.
Also Read:నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైల పాత్ర కీలకం