24 గంటలు గడవకముందే రుణభారంతో ఆదిలాబాద్లో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే…దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా? అన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసురు ఎందుకు తీస్తున్నారు అని ప్రశ్నించారు హరీశ్ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది కాంగ్రెస్ సర్కారు…కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇప్పటి వరకు 𝟒𝟎𝟐 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు,ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గం అన్నారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాడు అన్నారు. గతంలో రుణమాఫీ కాలేదని, అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టు చేసి, పోలీస్ యాక్ట్ (30 Act) పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కారు..రుణమాఫీ జరగకపోవడం తో రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారు. ఉన్న భూములు కుదవ పెట్టి అప్పులు తెస్తున్నరు అని దుయ్యబట్టారు.
Also Read:నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైల పాత్ర కీలకం