ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఇదే..

18
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. పాకిస్థాన్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. హైబ్రిడ్ మోడ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది.

15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. అయితే.. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మాత్రం ఈ జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. అత‌డి స్థానంలో ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్నారు.

భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్ (వైస్‌కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌, జ‌స్ ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌,రవీంద్ర జడేజా.

Also Read:నా ఆస్తులు నాకు ఇప్పించండి:మోహన్ బాబు

- Advertisement -