అమిత్ షా టూర్‌పై షర్మిలఫైర్

13
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. షా టూర్‌పై విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అమిత్‌ షా పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలు తెలుపాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే అమిత్ షాతో బహిరంగ క్షమాపణలకు డిమాండ్ చేయాలని కోరారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌ షా ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కార్యకర్తలకు సూచించారు. దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తక్షణం అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని… రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమని అన్నారు.దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనని ఏపీలో కూటమి నాయకులను విమర్శించారు.

Also Read:ఒంట‌రిగా వ‌స్తా.. మంచు మ‌నోజ్ షాకింగ్ ట్వీట్!

- Advertisement -