కాంగ్రెస్ ప్రభుత్వం 4 విషయాల్లో ప్రజలను గోరంగా మోసం చేస్తుందని గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు… సిద్దిపేట నియోజకవర్గం పార్టీ శ్రేణుల తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్బంగా మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 13 నెలలో ప్రజలను మోసం చేస్తుందని ఇప్పటికే 6 గ్యారంటీ లు ఆటకేక్కించందని, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్, ఇండ్ల విషయం లో గోరం గా మోసం చేస్తుందని హరీష్ రావు గారు మండిపడ్డారు.. గ్రామాల్లో వీటి ఫై గ్రామ సభలు నిర్వహిస్తున్నారని ఈ గ్రామ సభల్లో పార్టీ శ్రేణులు పాల్గొని నిజమైన, అర్హులైన పేదలకు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఫై నిలదీయాలన్నారు.
ఆత్మీయ భరోసా పేరు మీద రైతు లను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలుచేయాలని అడగాలాన్నారు… రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 2లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే ప్రభుత్వం తెచ్చిన నిబంధన లోతో 75000 మందికే వర్తిస్తుంది.. మిగతా లక్షా 25వేల మంది కూలీల సంగతి ఏందీ.. వీరంతా కూలి పనికి వెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమని అన్నారు.. ఎకరం లోపు భూమి ఉన్న రైతు కు కుడా ఈ పథకం వర్తించాలని గ్రామ సభలో అడగాలి… ఒక్క సెంటు భూమి ఉన్నా కూలి కాదు అని చెబుతున్నది. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలిగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదన్నారు.. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ 60 ఏళ్ళు నిండిన రైతు కు, పనికి వెళ్ళని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెప్తున్నది.
ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారు. కాబట్టి ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలి. రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి. గ్రామాల్లో 60ఏళ్ళు వాల్లు కుడా ఉంటారు… వ్యవసాయ కూలీలు కోటి మంది ఉంటారు కానీ మీరు 6లక్షల మంది కె ఈ పథకం వర్తించేల చేస్తున్నారు… హైదరాబాద్ సచివాలయం లో కూలీలను గుర్తించాల… గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభల్లో గుర్తించాల…? అని గట్టిగ నిలదీయాలన్నారు..
రైతు భరోసా 10వేలు ను 15 వేలు చేస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు కల్పి కోతలు ఎరవేతలతో 12 వేలు ఇస్తున్నారు.. ఎగొట్టిన వానాకాలం 6 వేలు సంగతి ఏందీ అని వానాకాలం పైసలు ఇవ్వాలని గ్రామ సభలో తీర్మానం చేపించాలి… రైతు భరోసా లో ఏరివేతలు చేస్తున్నారు.. న్యాయం గా ఉండే వారికి రైతు భరోసా వచ్చేలా చుడాలన్నారు.. అర్హులైన రైతులందరిని గుర్తించాలన్నారు..
Also Read:విద్యుత్ బకాయిలు..మున్సిపాలిటీకి కరెంట్ కట్!
ఇందిరమ్మ ఇల్ల విషయం లో ఇంటి స్థలం ఉండి కిరాయి ఉన్నవారికి, గుడిసెల్లో ఉండే వారికి, కవర్లు కప్పి ఉన్న ఇళ్లకు, అనాథలకు, ఒంటరి మహిళలకు, వికలాంగుల కు ఇజ్రా లక స్థలం ఉంటే ఇది వర్తిస్తుంది.. ఇలాంటి వారిని గుర్తించి అర్హులైన వారికి అందేలా చూడాలన్నారు..
రేషన్ కార్డు విషయంలో ఇప్పటికి గ్రామాల్లో, పట్టణం లో కుల గణన సంబంధం పెట్టి కొంతమంది కె వచ్చాయని, ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న వారి సంగతి, కెసిఆర్ గారి ప్రభుత్వం లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారి సంగతి ఏంటి అని గ్రామ సభల్లో నిలదీయండన్నారు.. గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజల వైపు నిలబడాలన్నారు.. నిజమైన, అర్హులైన పేదలందరికి న్యాయం జరిగేల చూడాలని.. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.