సైఫ్ కేసులో పట్టుకుంది నిందితుడిని కాదు!

3
- Advertisement -

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదన్నారు ముంబై పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్న వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి కాదని..వేరే కేసుకు సంబంధించిన వ్యక్తి అని తెలిపారు ముంబై పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేదని తెలిపారు.

తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ అలీఖాన్‌ను ఆరుచోట్ల కత్తితో పొడిచి గాయపడ్చాడు ఓ దుండగుడు. దీంతో సైఫ్‌ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం కోలుకున్నారు.

Also Read:ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా పంజాబ్‌లో నిర‌స‌న‌

- Advertisement -