విద్యుత్ బకాయిలు..మున్సిపాలిటీకి కరెంట్ కట్!

0
- Advertisement -

విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు సెస్ అధికారులు. అంధకారంలోనే విధులు నిర్వహిస్తున్నారు మున్సిపల్ అధికారులు.

విద్యుత్ సరఫరా లేకపోవడంతో కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోతున్నారు మున్సిపల్ అధికారులు. సెస్‌కు రూ.4 కోట్ల 58 లక్షల 90 వేల 749 రూపాయల విద్యుత్ బకాయి ఉంది సిరిసిల్ల మున్సిపల్.

డిసెంబర్, జనవరిలలో నోటీసులు జారీ చేసినా కూడా మున్సిపల్ అధికారులు స్పందించక పోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు సెస్ అధికారులు.

Also Read:ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా పంజాబ్‌లో నిర‌స‌న‌

- Advertisement -