- Advertisement -
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారు ముంబై పోలీసులు. బాంద్రాపోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి దొంగలు ఫైర్ ఎస్కేప్ నిచ్చెనను ఉపయోగించారు. ఇది దోపిడీ ప్రయత్నం అని అనిపిస్తుందని ఇప్పటికే పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.
గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో దాడి చేయగా.. సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం ముంబైలోని లీలావతి దవాఖానాలో చికిత్స పొందుతున్నారు సైఫ్.
Also Read:మంచు ఫ్యామిలీకి షాక్..2 కేసులు నమోదు
- Advertisement -