రేవంత్ రెడ్డి..లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా?:కేటీఆర్

4
- Advertisement -

చట్టాన్ని గౌరవింతే పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యానని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌లో దాదాపు ఏడు గంటల పాటు ఈడీ విచారించింది. సీఎం రేవంత్ రెడ్డి తన మీద కక్ష తీర్చుకునేందుకు ఈడీ కేసు పెట్టారన్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారన్నారు.

చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రేవంత్ నాపై పెట్టే కేసుల ఖర్చును ప్రజా సంక్షేమానికి వినియోగిస్తే బాగుంటుందన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు.

విచారణకు ఇంకా ఎన్ని సార్లైనా వస్తానని తెలిపారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క పైసా అవినీతి జరగలేదన్నారు. తప్పు చేయలేదు… తప్పు చేయబోమని తెలిపారు. తప్పు చేసుంటే ఏ శిక్షకైనా సిద్ధం అన్నారు.

Also Read:2025..ఫిబ్రవరి ప్రత్యేకత తెలుసా?

- Advertisement -