Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. హెల్త్ అప్‌డేట్

7
- Advertisement -

ముంబైలోని త‌న ఇంట్లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌ పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైఫ్ ఇంట్లోకి చొర‌బ‌డిన వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న ప‌దునైన ఆయుధంతో హీరోను పొడవగా ఆరు చోట్ల బ‌ల‌మైన క‌త్తిపోట్లు ఉన్న‌ట్లు లీలావ‌తి ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు చెప్పారు. రెండు చోట్ల మాత్రం ఆ క‌త్తి పోట్లు చాలా డీప్‌గా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

ఒక క‌త్తిపోటు సైఫ్ వెన్నుపూస స‌మీపంలో డీప్‌గా దిగిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. మెడ‌, చేయి, వెన్నులో ఓ ప‌దునైన ఆయుధంతో దాడి చేసిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. వెన్నులో దిగిన వ‌స్తువును స‌ర్జ‌రీ ద్వారా తొల‌గించిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

న్యూరోస‌ర్జ‌న్ నితిన్ దంగే, కాస్మిటిక్ స‌ర్జ‌న్ లీనా జైయిన్‌, అన‌స్థ‌టిస్ట్ నిషా గాంధీ.. ప్ర‌స్తుతం సైఫ్‌కు చికిత్స అందించిన‌ట్లు లీలావ‌తి ఆస్ప‌త్రి డాక్ట‌ర్ నీర‌జ్ ఉత్త‌మ‌ని తెలిపారు.

Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..

- Advertisement -