నులక మంచం @ లక్షలు

1
- Advertisement -

మనం కాదనుకున్న నులక మంచం ,అమెరికాలో లక్షల్లో ధర పలుకుతొంది..గతంలో పల్లెల్లో కానీ ,పట్టణాల్లో కానీ నులక మంచాలు, నవారు మంచాలు, ఆ తర్వాత పేముతో అల్లిన మంచాలు.. ఇవే ఉండేవి. కాలక్రమేణా డబుల్ కాట్లు ,రంగ ప్రవేశం చేశాయి. పరుపులు వేలల్లో ధర పలుకుతొంది. వాటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది.. చివరకు ఒళ్ళు నొప్పులు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు అంటూ డాక్టర్ దగ్గరికి పోయే పేషెంట్లకు వేరే రకం పరుపులు మెడికేటెడ్ బెడ్ అని చెప్పి అవి కూడా లక్షల్లో ధరలు పెట్టి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు . మళ్ళీ నులక మంచాలు వైభవం తిరిగి వస్తుందా అని అనిపిస్తోంది .

అయితే అది ఇక్కడ కాదు, అమెరికాలో .. ఆ దేశంలో ఒక్కో నులక మంచం ధర ఒకటిన్నర లక్ష నుంచి మూడున్నర లక్షల వరకు పలుకుతుంది. మీరు నమ్మలేని నిజం . అమెరికాలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఎత్సి తన వెబ్సైట్లో నులకమంచాలు ధరలు పెట్టింది. 50,000 నుంచి ప్రారంభమయ్యే నులకమంచం ధర మూడున్నర లక్షల రూపాయల వరకు ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు .

నులక మంచం సర్వకాల సర్వావవస్థల యందు ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్నది ఎవరు కాదనలేని సత్యం. ప్రకృతి వడిలో హాయిగా పవళించే అనుభవం నులక మంచం మీద నిద్రపోతే తెలుస్తుంది. ఒళ్ళు నొప్పులు దూరం అవుతాయి. నరాలు ఉత్తేజమై రక్తప్రసరణ సరిగా జరుగుతుంది.. ఆ రక్తప్రసరణ సక్రమంగా జరగడం వల్ల మెదడు ,గుండె ,నరాల జబ్బులు . వీటన్నింటికి కూడా సాధ్యమైనంత వరకు పల్లె ప్రజలు దూరంగా ఉండేవారు. నేటి నాగరిక యుగంలో లక్షల పెట్టి పరుపులు కొనే బదులు నులక మంచం మీద దుప్పటేసుకుని లేదా దుప్పట్లు లేకుండానే హాయిగా నిద్రలోకి జారిపోయే అనుభవం నేటి తరం యువకులకు లేదు , కానీ నిన్నటి తరం పెద్దలు ఎవరైనా ఉంటే అది వాళ్ళు సొంతం.

ఇప్పటికీ మనదేశంలోని పల్లె ప్రాంతాల్లో నులక మంచాల సంస్కృతి కనుమరుగైపోతున్నప్పటికీ అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. మరో విచిత్రం ఏమిటంటే చిన్న స్థాయి నుండి కోటీశ్వరులు అయినవారు పల్లెల నుండి పట్టణాలకు ఎదిగిన వారు నేటికి కూడా నిన్నటి తరం పెద్దలు రాజభవనాల లాంటి ఇల్లు కట్టుకున్నప్పటికీ వాటిల్లో నులక మంచం వేసుకొని పడుకుంటారనేది సత్యం. కొంతమందికి నులక మంచం లేకపోతే నిద్ర పట్టదు అదే వారి జీవితం . ఆర్థికంగా ఎదిగినా , అధునాతన భవంతులు కట్టుకున్నప్పటికీ బెడ్ రూమ్ ల్లో నులక మంచం మీద పడుకోవడమే ఇష్టం. అలాంటి వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు . ఇప్పుడు నులక మంచం వాడడం మనకి నా మోషీగా అనిపించినప్పటికీ విదేశాల్లో నులకమంచాల సంస్కృతి బాగానే పెరిగిపోతుంది. మనం వదిలేసిన నులకమంచం ఇప్పుడు లక్షల్లో ధరపలుకుతొంది.. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:కనులవిందుగా కనుమ పండగ..

- Advertisement -