సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

1
- Advertisement -

స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసింది జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ ఫైల్‌ చేశారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి.

2023 నవంబర్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. చార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది జస్టిస్‌ బేలా త్రివేది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ధర్మాసనం.

కేసు విచారణ అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది సుప్రీం కోర్టు.

Also Read:కనులవిందుగా కనుమ పండగ..

- Advertisement -