కిరణ్ అబ్బవరం.. “దిల్ రూబా”

0
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా “దిల్ రూబా” సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్ గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “దిల్ రూబా” ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే “దిల్ రూబా” రిలీజ్ తో మరింత స్పెషల్ కానుంది.

Also Read:కనులవిందుగా కనుమ పండగ..

- Advertisement -