రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి

0
- Advertisement -

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. వర్చువల్ గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలన్నారు.

రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారు అన్నారు. వీరంతా కూలి పనికి వెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారు అన్నారు. రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు అన్నారు.

గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరం… ఒక్క సెంటు భూమి ఉన్నా కూలి కాదు అని చెబుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలిగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదు అన్నారు.
అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్ళని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి అన్నారు.

ఐదు గుంటలు ఉన్న రైతుకు సంవత్సరానికి రైతు భరోసా కింద 1500 మాత్రమే వస్తాయి. ఐదు గుంటలు ఉన్న రైతుకు వ్యవసాయ కూలీ కింద 12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నష్టపోతారు.. ముఖ్యంగా దళితులు, గిరిజనులు.. తాతకు ఎకరం భూమి ఉంటే పిల్లలు పంచుకుంటే అది ఐదు గుంటలు వస్తాయి అన్నారు. 5 గుంటలో పంట పండింది లేదు, వారు బతికింది లేదు. 5 గుంటలు ఉన్నందుకు 12 వేల రూపాయలు ఇవ్వం అని ప్రభుత్వం చెప్పడం శోచనీయం అన్నారు.

Also Read:కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు!

రైతు భరోసా కింద మీరు ఇస్తున్నది 1500 అయితే ఎగ్గొట్టేది 12 వేల రూపాయలు… రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24 లక్షల 57,000 మంది ఉన్నారు అన్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతులు రైతు భరోసా తీసుకోవడం వల్ల రైతు కూలీలకు ఇచ్చే 12,000 నష్టపోతారు కాబట్టి. ఇలాంటి రైతులకు రైతు భరోసా కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా గుర్తించాలన్నారు.

ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారు. కాబట్టి ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలని…ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు ప్రకటించాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. కానీ లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు విడుదల చేయలేదు అన్నారు.

సిద్దిపేట జిల్లాలో 68 వేల దరఖాస్తులు వచ్చాయి..డోర్ టు డోర్ సర్వేలో మిగిలిన ఇళ్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఫైనల్ చేస్తారు అని పత్రికల్లో వార్తలు వచ్చాయి అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేది….అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరై అయిన వారు కొంత నిర్మించుకొని ఉన్నారు. ఇలాంటి ఇళ్లను పూర్తి చేసుకోడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం..అందరూ పేదవారే కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు హరీష్ రావు.

- Advertisement -