కాంగ్రెస్ పార్టీ గోవిందా..ముగ్గులు వేసి నిరసన

1
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ గోవిందా రేవంత్ రెడ్డి గోవిందా అంటూ ముగ్గులు వేసి నీరసన తెలిపారు ముఖరా కె గ్రామస్తులు. రైతు భరోసా గోవిందా, తులం బంగారం గోవిందా, రైతు రుణమాఫీ గోవిందా, 4000 పింఛను గోవిందా, మహాలక్ష్మి 2500 గోవిందా, ఆరు గ్యారంటీలు గోవిందా అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు గ్రామస్తులు.

6 గ్యారంటీలు నమ్మి మోసపోయామని,100 రోజులో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పి రెండు సీజన్లు ఎగగొట్టాడు అని, రుణమాఫీ కాలేదని, ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని అన్నారు రైతు భరోసా రాక పండుంగా చేసేదేలా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు గ్రామస్తులు.

Also Read:సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు..?

- Advertisement -