శ్రీవారి భక్తులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. జనవరి 8న అత్యంత దురదృష్టవంతమైన సంఘటన జరిగింది…అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం అదేశాల ప్రకారం పరిహారం అందజేశాం…బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేశారు అన్నారు.
కొన్ని ప్రసార మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాలలో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి…తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంభందించిన విషయం అన్నారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటిరెండు సార్లు పరిశీలించండి… మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారం అసత్య వార్తలు , ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోబడుతాయి అన్నారు.
పాలకమండలి కి…అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను…అందరు సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నాం అన్నారు. ఆ సంఘటన మినహా…..మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి…భక్తులు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు అన్నారు.
Also Read:KCR:సంక్రాంతి..వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ