- Advertisement -
మన సంస్కృతిని ముందు తరాలకు అందించేందుకు పండగలే వారధి అన్నారు ఎమ్మెల్సీ కవిత.భోగిపండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో వైభవంగా భోగి వేడుకలు నిర్వహించారు.
హైదరాబాద్ నడిబొడ్డున పల్లె వాతావరణం సృష్టించి భోగి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భోగి అంటేనే ప్రతికూలతను వదిలిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి.
ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరిని అలరించాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. చిన్నారులను భోగి పండ్లతో కవిత ఆశీర్వదించారు.
Also Read:KCR:సంక్రాంతి..వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ
- Advertisement -