ఏపీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు

20
- Advertisement -

ఏపీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందన్నారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు.

అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల కి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుంది. ఎన్టీపీసీ లో బొగ్గు మండించటం ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ ని పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తి కి వాడితే కాలుష్యం తగ్గుతుందన్నారు.

గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ను టెకోవర్ చేసి గ్రీన్ ఆమ్మోనియాను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ ప్లాంట్ మీద 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయి అని తెలిపారు చంద్రబాబు.

Also Read:నేనైతే ఖచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడిని!

- Advertisement -