తెలంగాణలో గుండారాజ్యం: కేటీఆర్

3
- Advertisement -

ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఎక్స్ వేదికగా తెలిపారు.

మా పార్టీ కార్యకర్తల, నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం అన్నారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.

వందేళ్ల చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీ చేయాల్సిన పని ఇదేనా అని ప్రశ్నించారు రాకేశ్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీల ఆఫీస్ లు పలగ్గొట్టుడు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పైన కర్రలతో దాడి చేసుడు.. ఇదేనా విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ పార్టీ నేర్పే పాఠం? చెప్పాలన్నారు. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా జాతీయ పార్టీగా మీ పెద్దరికం? అని ప్రశ్నించారు.

నేటి విద్యార్థి నాయకులు, యువ నాయకులే రేపటి భావి భారత నాయకులు. అలాంటప్పుడు వీళ్ళు నాయకులైతే మన దేశ భవిష్యత్తు ఏంటి? ,రాజకీయ పార్టీల విద్యార్థి సంఘాలు ఉన్నది విధ్వంసం సృష్టించడానికి, రౌడీయిజం చేయడానికి, నాయకులకు గులాంగిరి చేయడానికేనా? దీని పైన చర్చ జరగాలన్నారు.

Also Read:ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్!

- Advertisement -