సంక్రాంతి..పల్లె బాట పట్టిన పట్నం వాసులు

1
- Advertisement -

సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లె బాట పట్టారు నగరవాసులు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.

వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజా లో మొత్తం 16 టోల్ బూతులు ఉండగా, వాహనాల రద్దీ దృశ్య 12 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచారు.

మామూలు రోజులలో 35,000 నుండి 45000 వాహనాలు వెళ్తాయని సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే యాభై ఐదు వేల వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్లు టోల్ అధికారులు తెలిపారు.

వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుండి వెళ్తుంది,నిమిషానికి 300 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు టోల్ సిబ్బంది తెలిపారు.

హైవే పై ప్రతి 30 కిలోమీటర్ల కు ఒక క్రేన్, అంబులెన్స్,టోయింగ్ వెహికిల్ అందుబాటులో ఉంచినట్లు (NHAI )నేషనల్ హై వే అథారిటీ అధికారులు తెలిపారు.

పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ పై బారులు తీరాయి వందల వాహనాలు. టోల్ ఫీజులు వసూలు చేస్తుండడంతో భారీగా నిలిచిపోయాయి వాహనాలు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు.

Also Read:ఏపీకి మరో 50 మంది ఎమ్మెల్యే లు!

- Advertisement -