మంగళగిరి శంఖు తీర్థం

1
- Advertisement -

తంజావూరును పాలించిన మహారాజు ”రాజా సర్ పోజీII ” 1820 సం.లో మంగళగిరి స్వామివారికి బహూకరించిన ఈ ”ధక్షిణావృత శంఖు” తోనే ముక్కోటి నాడు భక్తులకు తీర్థాన్ని ప్రసాదిస్తారు.

ఏడాదికి ఒకసారి ఇచ్చే బంగారు శంఖు తీర్ధాన్ని స్వీకరిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆయనిచ్చిన శంఖు నేడు వేల మందికి ఆరాధ్య వస్తువు అయింది. రాజా సర్ పోజి కాలంలో అనేక హిందూ దేవాలయాల వద్ద సత్రాలు, పుణ్యనదుల వద్ద స్నాన ఘాట్ లు ఏర్పాటు చేశారట.

కాశీలో కూడా నట! వేల సంఖ్యలో నీటి బావులు, ఎన్నో చెరువులు, 4000 గ్రంథాలతో తంజావూరులో గ్రంధాలయం ఏర్పాటు, ఆయుర్వేదం అభివృద్ధికి, తమిళనాట మొట్టమొదటి జులాజికల్ పార్క్ ను ముదలగు వాటిని ఏర్పాటు, పేదవారికి అనేక అనేక దానాలు చేసిన తమిళ మహానుభావుడు !

ఆయన బ్రతికిన కాలం 40 ఏళ్ళు మాత్రమే అయితేనేమి ఈ యుగం ఉన్నంత కలం ఆ దక్షిణావృత శంఖు తీర్ధంతో ప్రజలు ప్రతి ఏటా వారిని గుర్తు చేసుకుంటూనే ఉంటారుకదా.

Also Read:రేవంత్ రెడ్డి నీది నోరా.. మోరీనా?

- Advertisement -