నాపై విష‌ప్ర‌యోగం జ‌రిగింది: జోకోవిచ్‌

2
- Advertisement -

టెన్నిస్ స్టార్‌ నోవాక్ జోకోవిచ్ సంచ‌ల‌న కామెంట్ చేశాడు. 2022లో మెల్‌బోర్న్‌లోని ఓ హోట‌ల్‌లో త‌న‌కు విష‌పూరిత ఆహారం ఇచ్చిన‌ట్లు చెప్పాడు. సీసం, పాద‌ర‌సం క‌లిసి ఉన్న ఆహారాన్ని ఇచ్చి త‌న‌ను ఇబ్బందిపెట్టిన‌ట్లు తెలిపారు.

కోవిడ్ టీకా వేసుకోని కార‌ణంగా.. మెల్‌బోర్న్ హోటల్‌లో త‌న‌ను నిర్బంధించార‌ని, ఆ స‌మ‌యంలో త‌న‌కు ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అయ్యాయ‌ని, మెల్‌బోర్న్ హోట‌ల్‌లో త‌న‌కు ఇచ్చిన ఆహారంలో క‌లుషితం ఉన్న‌ట్లు గుర్తించాన‌న్నాడు.

త‌న బాడీలో అధిక మోతాదులో లెడ్‌, మెర్క్యూరీ ఉన్న‌ట్లు తెలిపాడు. విష‌పూరిత ఆహారాన్ని ఇచ్చారా అని అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. అదొక్క‌టే మార్గంగా క‌నిపిస్తున్న‌ట్లు అత‌ను చెప్పాడు.24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జోకోవిచ్‌.. ఈ ఏడాది జ‌రిగే ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో పాల్గొన‌నున్నాడు.

Also Read:చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే: జగన్

- Advertisement -