చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే: జగన్

1
- Advertisement -

వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కూడా టీటీడీ వారు భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు? టీటీడీ ఛైర్మన్ ఎస్పీ, కలెక్టర్ అందరూ ఈ ఘటనలో భాగస్వాములే అన్నారు మాజీ సీఎం జగన్.

కుప్పంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వెళ్ళింది. తిరుపతిలో లక్షల మందికి టోకెన్లు ఇచ్చే దగ్గర ప్రత్యామ్నాయ ఏర్పాట్లే చేయలేదు. వచ్చిన భక్తులను వెంటనే క్యూలైన్లకు పంపకుండా, చీకట్లో ఒకేసారి గుంపుగా వదలడం వల్లే ఈ ఘటన జరిగింది అన్నారు.

ఘటనంతా ఒకచోటే జరిగినట్లు చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు. తొక్కిసలాట పలు కేంద్రాల వద్ద జరిగిందని ఎఫ్ఐఆర్ లో ఉంది. వివిధ కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డవారు ఈ ఆసుపత్రిలో ఉన్నారు అన్నారు.

Also Read:వైభవంగా వైకుంఠ ఏకాదశి

- Advertisement -