స్టడీ అవర్‌కు ఆలస్యం.. చితకబాదాడు!

4
- Advertisement -

స్టడీ అవర్‌కు ఆలస్యంగా వచ్చారని 30 మంది విద్యార్థులను వాతలు వచ్చేలా కొట్టాడు పీడీ. సిద్దిపేట – కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో స్పెషల్ స్టడీ అవర్‌కు ఉదయం ఆలస్యంగా వచ్చారు ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులు.

ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్ వాసు. ఒళ్లంతా వాతలు రావడంతో తరగతి గదిలో కూర్చొనేందుకు ఇబ్బంది పడ్డారు విద్యార్థులు. తీవ్రంగా గాయపడిన కొంత మంది విద్యార్థులకు సిద్దిపేటలోని ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం. ఫిజికల్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు… ఫిజికల్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు తల్లిదండ్రులు.

 

Also Read:#BSS12…’హైందవ’ గ్లింప్స్

- Advertisement -