కేటీఆర్ కోసం నిలబడతాం: హరీశ్‌ రావు

29
- Advertisement -

కేటీఆర్ కూడా కార్యకర్తనే, కేటీఆర్ కూడా పార్టీలో కార్యకర్తనే, కేటీఆర్ కూడా ఉద్యమకారుడే. ఈరోజు ఆయనికి ఏ ఆపద వచ్చినా పార్టీ మొత్తం అండగా నిలబడుతుంది. ఒక కార్యకర్త కోసం ఒక నాయకుడు కోసం ఎలాగైతే నిలబడ్డామో కేటీఆర్ కోసం నిలబడతాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

తెలంగాణ భవన్‌లో మాట్లాడిన హరీశ్‌ రావు… లగచర్లలో గిరిజన రైతులు అరెస్ట్ అయితే తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా పని చేస్తారో లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ అంత కష్టపడ్డారు అన్నారు.

వారి బెయిల్ కోసం.. వారి విడుదల చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కష్టపడ్డారు. పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా కార్యకర్తకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి ఆపద వచ్చిన మన పార్టీ మొత్తం ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు అండగా నిలబడ్డదన్నారు.

 

Also Read:కేటీఆర్‌ వెంట న్యాయవాది..హైకోర్టు అనుమతి

- Advertisement -