కేటీఆర్‌ వెంట న్యాయవాది..హైకోర్టు అనుమతి

3
- Advertisement -

కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగగా ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు న్యాయమూర్తి.

ఏసీబీ విచారణ సమయంలో కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండాలన్నారు. ఒక రూంలో ఇన్వెస్టిగేషన్ ఇంకో రూంలో అడ్వకేట్ కూర్చుంటే ఏసీబీకి ప్రాబ్లం ఏంటి? అని ప్రశ్నించింది న్యాయస్థానం.

న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్‌కు ఏసీబీ ఆఫీసులో సౌకర్యం ఉందో లేదో చెప్పాలని ఏఏజి కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 4 గంటలకు చెబుతాం ఆన్న ఏఏజి …ఒక ముగ్గురి న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదికి చెప్పింది హై కోర్టు. తదుపరి విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

Also Read:20 లక్షల ఇళ్లకు సోలార్‌: చంద్రబాబు

- Advertisement -