భూసేకరణ..రైతుల ఆందోళన

1
- Advertisement -

తమ భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగి జెసిబి కిందపడ్డారు రైతులు. రైతులను తమ పొలాల వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో అన్యాయంగా తమ భూములను లాక్కుంటున్నారని పురుగుల మందు తాగి, కెనాల్ గోతిలో పడుకొని రైతుల నిరసన తెలిపారు.

చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ కోసం గతంలో చేసిన సర్వే కాకుండా ఇప్పుడు కొత్తగా సర్వే చేసి, తమ భూములను లాక్కుంటున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. రైతులను తమ పొలాల వద్దకు రానివ్వకుండా పోలీసులను పెట్టి పనులను నిర్వహిస్తున్నారు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు.

Also Read:20 లక్షల ఇళ్లకు సోలార్‌: చంద్రబాబు

 

- Advertisement -