గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ రేట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ రేట్లను 10 రోజులు మాత్రమే పెంచాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ రేట్లను 14 రోజులు హైక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
డాకు మహారాజ్ బెనిఫిట్ షో ఈ నెల 12న ఉదయం 4 గంటలకు వేయనుండగా టికెట్ ధర రూ.500, మల్టీప్లెక్స్‌ల్లో రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 నిర్ణయించగా రోజుకు ఐదు ఆటలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
గేమ్ ఛేంజర్ తొలి రోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600 కాగా జనవరి 10 నుంచి జనవరి 23 వరకు ఐదు షోలకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతించారు.మల్టీప్లెక్స్‌లో టికెట్‌కు అదనంగా 175 రూపాయలు , సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్‌కు అదనంగా 135 రూపాయలు పెంపుతో ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
Also Read:20 లక్షల ఇళ్లకు సోలార్: చంద్రబాబు