ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను తొలగిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా . సంస్కరణల కోసం విద్యార్థులు సహా తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు తీసుకుంటామని చెప్పారు.
ఇకపై ఇంటర్ కాలేజీలు అంతర్గతంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తాయని, సెకండియర్ పరీక్షలను బోర్డు నిర్వహిస్తుందని క్లారిటీ ఇచ్చారు.ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనల కోసం సబ్జెక్టుల వారీగా సిలబస్ ను ఇంటర్మీడియట్ విద్యా మండలి పోర్టల్ bie.AP.gov.inలో పొందుపరుస్తున్నాం. సీబీఎస్సీకి అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షల్లో మార్పులు చేస్తున్నాం అన్నారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా, సెకండియర్లోనే నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. పది సంవత్సరాలు గా విద్యా వ్యవస్థలో సంస్కరణలు జరగలేదు అన్నారు. విద్యా విధానం 2025-26లో ఇంటర్మీడియెట్ విద్యా మండలి సిలబల్ అనుగుణంగా పాఠ్యపుస్తకాలు ప్రవేపెట్టడంపైన అభిప్రాయాలు తీసుకుంటాం. అలాగే, ద్వితీయ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న సిలబస్ యథావిధిగా కొనసాగిస్తూ 2026-27 నుంచి ఇంటర్మీడియట్ విద్యా మండలి సిలబల్ కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టడంపై అభిప్రాయాలు తీసుకుంటాం అన్నారు.
Also Read:ప్రధాని పర్యటనపై షర్మిల సెటైర్