కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులొస్తాయి: కేటీఆర్

3
- Advertisement -

చంద్రబాబు, నితీశ్ కుమార్ లాగా KCRకు టైమ్ వస్తుందని అన్నారు  కేటీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అతివిశ్వాసం వల్ల ఓడిపోయాం. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఆ ఎంపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదు అన్నారు.

రైతుబంధు పైసలు ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి, కానీ మేము రైతుల కోసం ఉంచిన పైసలనే నెలలపాటు సతాయించి పార్లమెంటు ఓట్లు పడేముందు వేసిండు అన్నారు.

ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తుంటే.. నన్ను ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.వాళ్లు కేసుల గురించి ఆలోచిస్తుంటే.. మనం రైతుల గురించి, ప్రజల గురించి మాట్లాడుదాం అన్నారు.

Also Read:స్వప్నాల నావ .. సిరివెన్నెలకి అంకితం

- Advertisement -